ఆరోగ్య కేంద్రం స్థలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ పరిశీలించారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు భాగం స్థల పరిశీలన కోసం మంగళవారం నాడు కుంచేపల్లి గ్రామ నందు స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ పరిశీలించి తదుపరి మండల లోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థలాల కేటాయింపు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కృష్ణ, ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, సుబ్బారావు సర్వేయర్ బ్రహ్మం, స్థానిక సచివాలయం కార్యదర్శి పద్మ, వివిధ శాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.