గుప్తా నిధులు కేసులో ఏడుగురు అరెస్టు- సిఐ సుధాకర్ రావు

తర్లుబాడు మండలం పోతలపాడు గ్రామంలో శనివారం అర్ధరాత్రి దసబందు వాటర్ ట్యాంక్ బ్రిడ్జి వద్ద గుప్తా నిధులు కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ప్రకాశం జిల్లా యస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు రాత్రి పూట గ్రామ రక్షక దళాలుగా ఏర్పాడి తిరుగుతున్న గ్రామస్తులకు కంటబడటం తో వారిని వెంబడించి 7 మందిని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు మరో ఇద్దరు పరార్ అయినట్లు పొదిలి సిఐ సుధాకర్ రావు పొదిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.

పోతలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గాయం శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై నరసరావుపేట చెందిన
ముద్దాయిలు సయ్యద్ కరీం ,మీరా వలి,సుభాని ,బత్హుల శ్రీనివాసరావు
తమ్మిశెట్టి మని ,మన్నం శ్రీనివాస్ ,
సయ్యద్ బాజీ లను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పెట్టినట్లు సిఐ సుధాకర్ రావు తెలిపారు

ఈ సమావేశంలో టిపి పల్లి యస్ఐ మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు