నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో పొదిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
పొదిలి ఏపీఎన్జీవో అధ్యక్షులు నారు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
యు టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి వి రమణ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం పి.ఆర్.సి 55 శాతం ఫిట్మెంట్ తో ఇవ్వాలని అదేవిధంగా పి ఆర్ సి కమిటీ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని అన్నారు ఏపీ జేఏసీ నాయకులతో చర్చించి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లకు ఆమోదయోగ్యమైన పి ఆర్ సి ను ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు.
యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ నేపథ్యంలో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని సిపిఎస్ మీద ఎలాంటి కమిటీలు వేసి కాలయాపన చేయకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.
ఏపీ ఎన్జీవో నాయకులు రఫీ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం నాయకులు గుంటూరు వీరబ్రహ్మం మాట్లాడుతూ సి ఎస్ కమిటీ సిఫార్సు చేసిన పి ఆర్ సి లో ఉద్యోగులకు పెన్షన్ క్వాంటం పెన్షన్ ను రద్దు చేయడం తగదని జీవితాంతం ఎన్ హాండ్స్ పెన్షన్ కొనసాగించాలని అన్నారు.
ఏపిటిఎఫ్ నాయకులు రఘు బాబు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలు ద్వారా ఏదైనా సాధించవచ్చని మనకు ఇవ్వవలసిన న్యాయమైన పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు శేషగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా ప్రజల్లో భాగస్వామ్యంతో చూడాలని వారికి కూడా ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు అధిక ధరలు ఉంటాయని తదనుగుణంగా పిఆర్పీ ప్రకటించాలని డిమాండ్ చేసినారు.
సిఐటియు నాయకులు రమేష్ మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్స్ మొదలగు వారికి ఇవ్వవలసిన న్యాయమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఆర్థిక ఆర్ధిక అంశాలు ఖచ్చితంగా ఇవ్వాలని లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిఐటియు తరపున పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు బిగ్ బుజ్జి బాబు డి బాల కాశి రెడ్డి , ఎం నాగార్జున బి కృపారావు ,గోనె శ్రీనివాసులు కుటుంబ చవలం వెంకటేశ్వర్లు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు షేక్ అబ్దుల్ ,
మహిళ సంక్షేమ శాఖ పద్మ ,
పెన్షనర్స్ అసోసియేషన్ నుండి డి ఎం నరసింహ శాస్త్రి, మదర్ వలి అంగన్వాడి శాఖ శోభ, ఆశ వర్కర్స్ న రాఘవమ్మ, రమాకుమారి, వైద్య ఆరోగ్య శాఖ జే వెంకటేశ్వర్లు, బ్యాంకింగ్ రంగం కె వి నారాయణరెడ్డి మున్సిపాలిటీ సుబ్బులు జిల్లా పరిషత్ సంధానిభాష ,జిందాషా మదర్ వలి , ఏపిటిఎఫ్ నాయకులు కె శ్రీనివాసులు బి టి ఎ నుండి నీలబోయిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు