జలభిషేకం చేసిన వాసవి క్లబ్ సభ్యులు

ప్రకాశం పొదిలి వాసవిక్లబ్స్ ఆద్వర్యంలో ధనుర్మాసం సందర్బంగా పొదిలి లోని శ్రావనిఎస్టేట్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం నందు నెలమాళిగలలో వేంచేసివున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి జలోత్సవా అభిషేకం కార్యక్రము ఘనంగా జరిగింది అమ్మవారిశాల నుండి 108 మంది మహిళలు కలిశాలతో మామేళతాలలతో ఊరేగింపుగా ప్రధాన వీధుల మీదుగా ఆలయం వద్దకు చేరుకున్నారు తదనంతరం వారుతెచ్చిన కలసాలలోని జలాలతో ,పాల తో అభిషేకించారు. తదనంతరం స్వామివారిని అలంకరించి పూజలుచేశారు అన్నపూర్ణ సేవసమితి వారూ భక్తులకు ప్రసాద వినియోగంచేశారు వాసవిక్లబ్ నూతన కమిటీ సభ్యలందరుచెపుతూ వారు ఎన్నికైన తరువాత మొదటి కార్యక్రము గా ఈ దేవుని కార్యక్రమం నిర్వహించటం ఎంతో సంతోషాన్ని ఇచ్చినది అని స్వామివారి ఆశీస్సులతో ఈ సంవత్సరం లో ఇంకా ఎన్నో మంచికార్యక్రమాలు చేస్తమని తెలిపారు.