పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరపురానివి శాసనసభ్యులు కుందూరు
పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక పెద్ద బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు పొందూరు నాగార్జున రెడ్డి ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ కోసి పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ సమయంలో పాపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారు అందించిన సహాయ సహకారాలు మరువలేనివని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవకుల స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు
సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పేరం సుభాష్ మాట్లాడుతూ పొదిలి నుంచి ఈగలపాడు వరకు ప్రతి కిలో మీటర్ కు ఒక సిమెంట్ బల్ల ఏర్పాటు చేస్తున్నామని నడిచి వెళ్లే వరకు ప్రయాణికులు సేదతీర్చడానికి ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు