తెలుగు యువత పార్లమెంట్ కమిటీ లో మువ్వ ,దామిరెడ్డి , పెరికె

తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా మువ్వ కాటంరాజు యాదవ్ కార్యదర్శిగా దామిరెడ్డి అంజీరెడ్డి
లను మార్కాపురం నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా పెరికె సుకదేవ్ లను నియమిస్తూ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ , తెలుగు యువత అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారు.

కొనకనమీట్ల మండలం కేంద్రంకు చెందిన కీలకమైన యువ నేత గా గుర్తింపు పొందిన కాటమరాజు యాదవ్ కు సముచిత స్థానం దక్కటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 15వ వార్డు మాదాల వారి పాలెం చెందిన దామిరెడ్డి అంజీరెడ్డికి తెలుగు యువత లో స్ధానం కల్పించాటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు

కొనకనమీట్ల మండలం గొట్లగట్టు గ్రామ పంచాయతీ సర్పంచ్ పని చేస్తున్న పెరికె సుకదేవ్ ను నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు ఎంపిక కావటం పలువురు హర్షం వ్యక్తం చేశారు