పేద అనాధ బాలలకు దుస్తుల పంపిణీ

పొదిలి బాలికల ఉన్నత పాఠశాల నందు గురువారం నాడు పాఠశాలలో చదువుతున్న అనాధ పాక్షిక అనాథ పేద విద్యార్థులకు పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో దుస్తులు, చెప్పులు, పరీక్ష సామాగ్రిని మండల విద్యాశాఖ అధికారి కె రఘురామయ్య పంపిణీ చేశారు.

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసులు అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన విద్యా శాఖ అధికారి కె రఘురామయ్య 40 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బేగ్ , పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కిరణ్ ప్రధాన ఉపాధ్యాయులు సోమరాజు మరియు సి ఆర్ పి లు కుమార్ సుబ్బారెడ్డి ఇ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు