రేపు పొదిలి కి రానున్న ఐపియల్ క్రికెటర్

పొదిలి పట్టణంలో జరుగుతున్న క్రికెట్ పోటిల్లో పాల్గొనటానికి ఐపియల్ క్రికెటర్ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే స్థానిక యస్పీకెపి డిగ్రీ కళాశాల నందు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మంగళవారం నాడు కుంచేపల్లి అంజి పాంథర్స్ టీం మరియు యస్ యస్ లెవన్స్ సంబంధించి క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో కుంచేపల్లి అంజి పాంథర్స్ టీం తరుఫున ఆడటానికి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు అయ్యప్ప రానున్నట్లు క్రికెట్ నిర్వాహకులు తెలిపారు