ఐపీఎల్ క్రికెటర్ రాక ఉత్కంఠభరితంగా సాగిన పైనల్ మ్యాచ్
పొదిలి పట్టణంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఎస్ ఎస్ లెవన్స్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలో ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ క్రికెటర్ అయ్యప్ప రాక మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.
డిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు అయ్యప్ప కుంచేపల్లి అంజి పాంథర్స్ టీం తరుఫున ఫైనల్ మ్యాచ్లో పాల్గొన్ని 3 ఓవర్లు బౌలింగ్ వేసి 4 వికెట్లు తీసి జుట్టు విజయానికి కీలకపాత్ర పోషించారు.
అనంతరం ఫైనల్ మ్యాచ్లో కుంచేపల్లి అంజి పాంథర్స్ టీం విజయం సాధించాటంతో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించారు.
అనంతరం నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ ఫైనల్ మ్యాచ్లో తిలకించేందుకు పొదిలి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు
ఫైనల్లో మ్యాచ్ అనంతరం ఐపీఎల్ క్రికెటర్ అయ్యప్ప తో స్వీయ చిత్రల కోసం అభిమానులు పోటీపడ్డారు.