హాబిబుల్లా బేగ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
హాబిబుల్లా బేగ్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఐ సుధాకర్ రావు దుప్పట్లను పంపిణీ చేశారు.
స్థానిక ఇస్లాం పేట మసీదు నందు సంస్థ ఛైర్మన్ కరీముల్లా బేగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నందు ముఖ్య అతిథులుగా హాజరైన పొదిలి సిఐ సుధాకర్ రావు, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ హాబిబుల్లా బేగ్ సేవా సంస్థ సేవలు మరపురానివి అని లాక్ డౌన్ సమయం వారు సేవాలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి, సిఐటి యు జిల్లా కార్యదర్శి యం రమేష్, యుటిఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ హై, ప్రధానోపాధ్యాయులు బి వి రంగయ్య, లాయర్ షబ్బీర్, జెవివి పొదిలి డివిజన్ అధ్యక్షులు డి చంద్రశేఖర్,టి నారసారెడ్డి,మధార్ వలి, ముసాజాని, రబ్బాని మరియు తదితరులు పాల్గొన్నారు.