రజక విద్యార్థి సంఘం డైరీ ఆవిష్కరణ

రజక విద్యార్థి సేవా సంఘం 2022 సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమాని ఆదివారం నాడు నిర్వహించారు.

స్థానిక విశ్వనాథపురంలోని ప్రైవేటు విద్యా సంస్థ నందు తళ్ళపల్లి వెలుగోండయ్య ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి శ్రీనివాసులు, సెయింట్ అన్స్ విద్యా సంస్థ డైరెక్టర్ పొదిలి ఏడుకొండలు,రజక యూత్ నాయకులు బొప్పరాజు నరసింహారావు,రాయల్ల రమణయ్య, ఏడుకొండలు మరియు రజక యువజన విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు