రెవిన్యూ డివిజన్ కై ఉద్యమించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం
పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఎన్నిక
పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన కోసం స్థానిక శివాలయం నందు న్యాయవాది వరికూటి నాగరాజు అధ్యక్షతనతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పొదిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని, పెద్ద చెరువు ను రిజర్వాయర్ గా చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన కోసం సోమవారం నాటి నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక తో ఉద్యమించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా మాకినేని రమణయ్య
అధ్యక్షులుగా గునుపూడి భాస్కర్, ప్రధాన కార్యదర్శి గా వరికూటి నాగరాజు, ఉపాధ్యక్షులు గా యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొల్లా నరసింహా యాదవ్, మాకినేని అమార్ సింహా, పేరుస్వాముల శ్రీనివాస్, కార్యదర్శులుగా బండి అశోక్, కనకం వెంకట్రావు,రమణ కిషోర్, చంద్రశేఖర్
సహాయ కార్యదర్శిలుగా షేక్ జిలానీ భాషా, దాసరి మల్లి, దర్నాసి పెద్దన్న, చిరంజీవి, శ్రీదేవి, వెంకట రామయ్య, షేక్ కలేషా, చిట్లూరి బాదుల్లా రమేష్, షేక్ మస్తాన్ వలీ పాలడుగు నాగేశ్వరరావు మేడా నరసింహారావు లతో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో మందగిరి వెంకటేష్ యాదవ్, ఆమాదలపల్లి గ్రామ సర్పంచ్ శిరిమల్లే శ్రీనివాస్ , యేటి ఏడుకొండలు, కరిమూల్లా బెగ్, మాగూలూరి రామయ్య, తదితరులు పాల్గొన్నారు