పిఆర్పీ పై అభిప్రాయ సేకరణ (పోల్ సర్వే)

పొదిలి డివిజన్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య వేదిక చైర్మన్ షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన పొదిలి యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్దు 11వ పిఆర్సి పైన పోల్ సర్వే అభిప్రాయసేకరణ పోల్ సర్వే నిర్వహించినారు.

ఎన్నికల అధికారిగా ఏ బాదుల్లా ఎన్నికల పరిశీలకుడిగా వీరబ్రహ్మం ఆధ్వర్యంలో పిఆర్సి ఓటింగ్ , సర్వే పోల్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐక్యవేదిక చైర్మన్ షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి ఫిట్మెంట్ పై పునరాలోచించి 27% శాతం కొనసాగించాలని ,సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ లో పునరుద్ధరించాలని మార్చి 31వ తేదీ లోపు బౌండ్ లైన్ లోపు సిపిఎస్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసారు.

పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు చెల్లించాల్సిన 2100 కోట్ల నిధులు వెంటనే చెల్లించాలని ఉన్నారు.

రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ, కముటేషన్, ఎన్ క్యాష్ మెంట్,ఏపీ జి ఎల్ ఐ ,పి ఎఫ్ ,జి ఐ ఎస్ వంటి ఆర్థిక ప్రయోజనాలకు చెల్లించవలసిన చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు

పెంచిన గ్రాట్యుటీ 16 లక్షల రూపాయలను 01-04- 20 20 వ తేదీ నుండి అమలు చేయాలని పిఆర్సి కాలపరిమితిని పది సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల కి తగ్గించి జీవోను వెంటనే విడుదల చేయాలని అన్నారు

నూతన విద్యా విధానం ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల న్ను ఉన్నత పాఠశాల విలీనం ఆపాలని అన్నారు
కాంట్రాక్టు ఉద్యోగులకు సర్వీస్ క్రమబద్ధీకరించాలని అన్నారు

అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మినిమం టైం స్కేల్ మరియు డి ఎ మరియు హెచ్ఆర్ఏ చెల్లించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 21 నుండి రెగ్యులర్ చేయాలని పెన్షనర్స్ కు అడిషనల్ క్వాంటం పెన్షన్ శాతాన్ని7 నుండి10 పెంచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేశ్వరరావుజిల్లా కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాల కాశి రెడ్డి ,కృపారావు నాగార్జున రావు గోనె శ్రీనివాసులు ఏపీటీఎఫ్ సంఘం నుండి కె శ్రీనివాసులు, ఖాజావలి కోటేశ్వరరావు బి టి ఎ నుండి సంఘము నుండినీల బోయ శ్రీనివాసులు పెన్షనర్ల సంఘం నుండి నరసింహశాస్త్రి చిత్తం శెట్టి సుబ్బారావు, షేక్ కరీముల్లా బెగ్ , యుటిఎఫ్ సీనియర్ కామ్రేడ్స్ పి శ్రీనివాస్ రెడ్డి కాసు తిరుపతి రెడ్డి పి రమేష్ , దేవ ప్రసాద్, ఓబుల్ రెడ్డి , ఎం శివారెడ్డి సింగంపల్లి సుబ్బారావు, కేసెస్ రాంప్రసాద్ కొండలరావు నారాయణ శైలజ చంద్రమౌళి ఆశాలత అనామిక ,హనుమంతు బాబు ,రామారావు ,కొత్త హరిప్రియ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు