జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీల్లో పొదిలి క్రీడాకారులు

పొదిలి బాలుర ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న జి అజయ్ కుమార్, గురుశేఖర్, శివకృష్ణ, కళ్యాణ నంద లు ఈ నెల 7, 8 తేదీలో అనంతపురం జిల్లా ఉరవకొండ లో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు.

వీరు ఈ నెల 27 నుంచి 31 జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా బుధవారం నాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రంగయ్య, పిడి, రామకృష్ణ, పి.డి ప్రసాద్, మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు