ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు 12 లక్షల విలువైన 24 వాహనాలు స్వాధీనం
కొనకనమిట్ల మండల కేంద్రంలో యస్ఐ ఫణి భూషణ్ బుధవారం నాడు సాధారణ తనిఖీలు నిర్వహించే సమయంలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న మండలంలోని తువ్వపాడు గ్రామానికి చెందిన బుద్దపాటి శ్రీనివాసరావు పోలీసులను చూసి తప్పించుకొనే ప్రయత్నం చేయగా చాకచక్యం పోలీసులు అరెస్టు చేసినట్లు పొదిలి సిఐ సుధాకర్ రావు తెలిపారు.
స్థానిక కొనకనమిట్ల పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిఐ సుధాకరరావు మాట్లాడుతూ ముద్దాయి జూదానికి మద్యానికి బానిస అయ్యి తన స్వంత గ్రామం లో మరియు ఇతరుల వద్ద సుమారు 10 లక్షల దాకా అప్పులు చేసడని ముద్దాయి గతం లో అనగా 2012 సంవత్సరం లో మోటార్ సైకిల్ల దొంగతనం కేసు అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తరువాత మరల మోటార్ సైకిల్ల దొంగతనం చేస్తూ కావలి పోలీసు స్టేషన్ లో 2014 లో అరెస్ట్ కాబడినాడు, అప్పుడు అతనకి జైలు శిక్ష కూడా పడింది.
జైలు నుంచి బయటక వచ్చిన తరువాత సదరు ముద్దాయి మరల పేకాట మరియు తన జల్పాలకు అని చెప్పి మరల మోటార్ సైకిళ్ళు దొంగతనాలను ప్రారంభించి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, కొండపి, కనిగిరి, ఒంగోలు, చీమకుర్తి, తాళ్ళూరు, కొనకనమిట్ల ప్రాంతాల మొత్తం 24 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసి వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డినట్లు ముద్దాయి దగ్గర నుంచి 12 లక్షల విలువైన 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ముద్దాయిని కోర్టులో హాజరు పరచనున్నమని తెలిపారు.
ఈ విలేఖరుల సమావేశంలో కొనకనమిట్ల యస్ఐ ఫణి భూషణ్ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు