ఘానంగా వివేకానంద జయంతి వేడుకలు
స్వామి వివేకానంద 155 జయంతి వేడుకలు ను పొదిలి విశ్వనాథపురం విశ్వశాంతి హైస్కూల్ నందు మాతృమూర్తి థేరిసా సోసైటి అధ్యక్షులు కెల్లంపల్లి నజీర్ ఆద్వర్యం లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందుడుని ఆదర్శంగా తీసుకోవాలిని కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా తిరిగి లేస్తున్నందుకు నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే. నిరంతరం శ్రమించే వాన్ని చూసి ఓటమి భయపడుతుంది మందలో ఒకరిగా కాదు వంద లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ యువనాయకులు జావేద్ (లడ్డూ ) శ్రీనివాసులు రెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు