శీతల చలివేంద్రాన్ని ప్రారంభించిన కందుల
శీతల చలివేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు.
శనివారం నాడు స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మీగడ ఓబుల్ రెడ్డి, పండు అనిల్, స్వర్ణ గీత, షేక్ షన్వాజ్ , ఎండీ గౌస్ జ్యోతి మల్లి,షేక్ గౌస్ భాష , కాటూరి శ్రీను కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు