ఆర్ఎంపి,పిఎంపి నూతన కమిటీ ఎన్నిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల మండలాల గ్రామీణ వైద్యులు సంఘం అధ్యక్షుడిగా కెఎల్ నారాయణ ఏకగ్రీవం ఎన్నికయ్యారు
ఒంగోలు ఎయిమ్స్ వైద్యశాల నందు జిల్లా అధ్యక్షులు సింగయ్య, ఉపాధ్యక్షులు సయ్యద్ ఇమాంసా పర్యవేక్షణలో పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల మండలాలకు కలిపి నూతన కమిటీని
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అద్యక్షులు గా కెఎల్ నారాయణ, ఉపాధ్యక్షులుగా ఆనంద్, కార్యదర్శిగా నారాయణ, సహాయ కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారిగా సిహెచ్ భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా పి.కొటేశ్వరరావు,కె.మోహన్ రావు, నాగయ్య ను ఎన్నుకోవడం జరిగింది.