ఉడుముల పై దాడి కేసు కొట్టివేత
2009 సార్వత్రిక ఎన్నికల లలో మార్కపురం నియైజకవర్గం శాసనసభ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గా కె పి కొండరెడ్డి పోటి చేయటంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అప్పటి సిట్టింగ్ కంభం శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయటం తోపాటు ఎన్నికల ఎజెంట్ గా కూడా పని చేసారు అందులో భాగం గా 23.04.2009 పోలింగ్ రోజున కొనకనమీట్ల మండలం చినమనగుండం గ్రామం నందు కాంగ్రెసు పార్టీ ఎజెంట్లును పోలింగ్ కేంద్రం నుండి గెంటివేసారనే సమాచారం తెలుసుకొన్న ఉడుముల శ్రీనివాసులు రెడ్డి వెంటనే సదరు గ్రామంలోకి ప్రవేశించగానే పోలింగ్ కేంద్రం వద్ద కు వెళ్ళకుండా ఒక్కసారి గా వందలాది తెదేపా కార్యకర్తలు అతని వాహనం పై దాడి చేయటం తో గన్ మెన్లు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఉడుముల శ్రీనివాసులు రెడ్డి ని ఎటువంటి ప్రాణహాని కాలగకుండా రక్షించారు ఈ సంఘటన పై సుమారు 9 సంవత్సరాల తరవాత శుక్రవారం సాయంత్రం మార్కపురంలోని ప్రత్యేక కోర్టు కేసు ను సరైన సాక్ష్యదారలు లేని కారణంగా కొట్టివేయడం జరిగింది