తెలుగుదేశం పార్టీ లో ఏదో జరుగుతుంది !
రెండు రోజుల్లో కీలకమైన ప్రకటన చేసేందుకు సన్నాహాలు
సమావేశం అయిన మండల ముఖ్య నేతలు
పార్టీ లో కీలక మలుపులు చోటుచేసుకొనే అవకాశం
తిరుగుబాటు బావుటా ఎగురవేసే దిశగా అడుగులు
- పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు గత వారం రోజులుగా పలు దఫాలుగా రహస్య సమావేశాలు
నిర్వహించటం తో పార్టీ లో ఏదో చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుందనే భావన పార్టీ కార్యకర్తల్లో నెలకొంది.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన తర్వాత ముఖ్య నాయకులు కీలకమైన ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
అసలు ఏమి జరుగుతుంది అనే విషయాలపై పొదిలి టైమ్స్ అరా తీయగా ప్రధాన నాయకుడు పని తీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్న నాయకులు గత పదిహేను రోజులుగా తరుచూ సమావేశం అవుతూ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయాల కసరత్తు మొదలు పెట్టారని అందురు ఏక అభిప్రాయం తో ఉన్నారని ఏప్రిల్ 20 తేదీ చంద్రబాబు నాయుడు జన్మదిన తర్వాత కీలకమైన ప్రకటన చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
తెలుగుదేశం పార్టీ లో ఏం జరగబోతుందో అనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడుతుందా లేక పార్టీ బుజ్జగింపులతో మౌనంగా ఉంటారా అనే విషయం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది