సి ఐ టి యు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ ధర్నా
- పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సిఐటియు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం పొదిలి మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయితీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ ధర్నానుద్దేశించి సిఐటియు నాయకులు ఎం రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలన్ని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
పొదిలి నగర పంచాయితీ పరిధిలో 140 మంది కార్మికులు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 45 స్వీపర్ల పని చేస్తున్నారని దాని మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితి ఘోరం ఉందని తక్షణమే అదనపు పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రమేష్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు