పొదిలి లో పొగాకు రైతులు రాస్తారోకో
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు రైతులు రాస్తారోకో నిర్వహించారు.
స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒంగోలు కర్నూల్ జాతీయ రహదారి పై పొగాకు రైతులు రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
రాస్తారోకో విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చా జెప్పి రాస్తారోకో ను వివరింపజేశారు.
అనంతరం బారి గా నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసారు.
ఈ కార్యక్రమంలో పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు