బుర్రా కు శుభాకాంక్షలు తెలిపిన పుల్లగోర్ల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయస్సార్ కాంగ్రెసు పార్టీ) ప్రకాశం జిల్లా అధ్యక్షులు గా నియమితులైన బుర్రా మధుసూదన్ యాదవ్ కు కంభాలపాడు మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రావులపల్లి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో బిసిలకు సముచిత స్థానం కల్పించడం తోపాటు పార్టీ పదవుల్లో కూడా బిసిలకు సముచిత స్థానం కల్పించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.