ఆదర్శ గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దుతా- సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్
ఆముదాలపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతానని సర్పంచ్ సిరుమల్లే శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఆదివారం నాడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సందర్బంగా పొదిలి మండలం ఆముదాలపల్లి పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ చిరుమల్లె శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతనతో జరిగిన గ్రామసభలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజల శ్రేయస్సు తనకి ముఖ్యమని వారికి ఉన్న అన్ని సమస్యలు తనదృష్టికి తీసుకొని వస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
గ్రామ పంచాయతీ లో ప్రతి గ్రామాని అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లు పంచాయతీ ని ఆదర్శ పంచాయతీ గా ఎంపిక చేసారని వారి సహాకారంతో యాక్షన్ ప్లాన్ రూపొందించి మౌళిక సదుపాయాల కల్పన కల్పించి ఆదర్శ పంచాయతీ తయారు చేస్తానని అన్నారు
ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి మరియు వార్డ్ సభ్యులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.