తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండల పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించక పోవటం చేసిన పనికి చెల్లింపులు చెయ్యకుండా అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తాన్న మండల అభివృద్ధి అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ఫీల్డ్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు
రాస్తారోకో సుమారు గంటన్నర సేపు జరగటంతో వందలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకొని ఉన్నాయి విషయం తెలుసుకున్న కొనకనమీట్ల యస్ఐ ఫణి భూషణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని తెదేపా నాయకులు చర్చించి రాస్తారోకో విరమించాలని చేయమని కోరిన వినకపోవడంతో పొదిలి సిఐ సుధాకరరావు ఆదేశాలతో హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో పొదిలి యస్ఐ శ్రీహరి చేరుకొని నిరసనకారులతో మాట్లాడి సంబంధించిన అధికారులు తో మాట్లాడిస్తానని హామీ ఇచ్చి రాస్తారోకో విరామవింపజేసారు
అనంతరం భారిగా నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తక్షణమే పార్టీలకతీతంగా ఉపాధి హామీ పనులను అమలు చేయాలని మరియు మస్టర్ లను పార్టీలకతీతంగా సరైన మెట్ లను నియమించి ఖచ్చితత్వం గా ఉపాధి హామీ పనులను కూలీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రహదారిపై వందల వాహనాలు నిలిచిపోయాయి.
అటు పిమ్మట మండల అభివృద్ధి అధికారి మరియు ఏ పీ ఓ లు తక్షణమే వచ్చి సమస్యలు పరిష్కరించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. తిరిగి రెండవసారి ఎంపీడీవో ఆఫీస్ ముందు రెండవసారి రాస్తారోకో చేశారు. మండల అభివృద్ధి అధికారి విచ్చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.
ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుమూరబోయిన బాబురావు యాదవ్, పొదిలి ఏఎంసి మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పెరికె సుక్ దేవ్ , ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మువ్వా కాటం రాజు గారు, తెలుగు దేశం పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి , వేంపాటి శ్రీకాంతరెడ్డి, జిల్లా సాంకృతిక విభాగం కన్వీనర్ కొనంకి సల్మాన్, నాయకులు దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు అంకాళ రోశయ్య,కుందూరి కాశిరెడ్డి, బాషాపతి,రామిరెడ్డి, తీమోతి ,కాశీరావు, రమణయ్య ,ముక్కల నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, లెవి, కిరణ్, కె గురవయ్య, జీన్నయ్య, పెరికే రత్నం,చిన్న వెంకటరెడ్డి, డేవిడ్,కోటేశ్వరరావు,భవనం వెంకటేశ్వరరెడ్డి,ఐ టీడీపీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ఉపాధిహామీ మహిళా కూలీలు తదితరులు పాల్గొన్నారు