రైతు ఆత్మహత్య పై ముగ్గురు సభ్యుల బృందం విచారణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలం గొల్లపల్లి గ్రామం నందు ఇటివల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కోటి రెడ్డి మృతి చెందిన సంఘటన పై ముగ్గురు సభ్యుల బృందం విచారణ చేపట్టింది.
బుధవారం నాడు స్థానిక గొల్లపల్లి గ్రామం నందు తహశీల్దారు దేవ ప్రసాద్, యస్ఐ శ్రీహరి, మండల వ్యవసాయ శాఖ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు తో గల ముగ్గురు సభ్యుల బృందం గ్రామస్తులతో మరియు మృతుని కుటుంబం సభ్యులను విచారించి నివేదిక తయారు చేసారు.
సంబంధిత సమాచారం తో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు పంపనట్లు తహశీల్దారు దేవ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు