ఒంగోలు-నంద్యాల రహదారి పై మహిళలు రాస్తారోకో
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఒంగోలు-నంద్యాల రహదారి పై పోతవరం గ్రామం వద్ద మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
గత 10 రోజులు నుంచి నీటి సరఫరా చెయ్యకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్ధానికులు గురువారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో ను వివరింపజేశారు.
భారీ ఎత్తున నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసారు