బ్రహ్మ గారి ఆరాధన ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు- డిఎం సుందరరావు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బ్రహ్మ గారి మఠం నందు ఆరాధన ఉత్సవాల సందర్భంగా పొదిలి ఆర్టీసీ డిపో కు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం సుందరరావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ వలన ఉత్సవాలకు వెళ్లలేని భక్తులు ఈ సంవత్సరం భారీ ఎత్తున భక్తులు వెళ్లేందుకు తరలి వచ్చారని తమ అంచనాలకు మించి భక్తులు వచ్చారని భక్తుల సౌకర్యార్థం 35 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసామని అంతకు మించి అవసరం ఉన్నా ఏర్పాటు చేస్తామని తెలిపారు.