తెదేపా ఆధ్వర్యంలో బాదుడే బాదుడు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 5,6 వార్డుల్లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంపిణీ చేశారు.
అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచటం విద్యుత్ బస్సు చార్జీలు పెంచుటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి పండు అనిల్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ భాష లీగల్ సెల్ నాయకులు యస్ ఎం భాషా, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్ ,తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు