బిసి సెల్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కనకం నియామకం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రకాశం జిల్లా తెలుగు దేశం పార్టీ బిసి సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కనకం వెంకట్రావు యాదవ్ ను నియమించారు.

పొదిలి నగర పంచాయితీ మూడో వార్డు కాటూరి వారి పాలెం చెందిన కనకం వెంకట్రావు యాదవ్ తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ కి అనుచరుడు కాగా అదే విధంగా పొదిలి,కొనకనమిట్ల మండలాల్లో బలమైన బిసి నాయకుడు గా గుర్తింపు పొందారు.

 

తనకు పదవి లభించుటకు కారకులైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, తెలుగు దేశం పార్టీ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు.