ఎరువులు , విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణంలో ఉన్న ఎరువులు మరియు విత్తనాల దుకాణాలపై విచ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

బుధవారం నాడు పట్టణంలోని పలు విత్తనాల ఎరువుల దుకాణాల్లో రికార్డులను పరిశీలించి అనంతరం వాసవీ కాంప్లెక్స్ లోని స్టాకు పాయింట్లు ను పరిశీలించారు.

ఈ సందర్భంగా విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ హర్ష మాట్లాడుతూ రికార్డు లో ఉన్న ప్రకారం స్టాక్ పాయింట్లు లోని సరుకును పరిశీలించిన తర్వాత అవకతవకలకు పాల్పడినట్లు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు