రేపటి నుంచి రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.
స్థానిక పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణం నందు ఆదివారం ఉదయం టెన్నిస్ బాల్ తో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయని మొదటి బహుమతి 50116/- ,రెండో బహుమతి 30116/-,మూడో బహుమతి 20116/- ,అదే విధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ , మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ప్రధానం చేయనట్టు ఆర్గనైజర్ పిల్లి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.