పొదిలి పట్టణంలో బాదుడే బాదుడు
పొదిలి నగర పంచాయితీ లోని 8వ వార్డు నందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
శని వారం నాడు స్థానిక 8వ వార్డు నవాబుమిట్ట నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు పొదిలి మండలం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి ,పొదిలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్ ,పొదిలి మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్,సయ్యద్ ఇమాంసా,యస్ ఎం భాషా,ముల్లా రబ్బానీ, ,ముని శ్రీనివాస్ ,జ్యోతి మల్లి, నరసింహారావు, షేక్ మస్తాన్ వలీ, షేక్ గౌస్ భాష, బొడ్డు సుబ్బయ్య, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు