యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు విధించిన యన్ఐఏ కోర్టు
తీవ్రవాదులకు నిదులు పంపిణీ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు లో ఒప్పుకున్నా జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ యాసిన్ మాలిక్ కు బుధవారం నాడు కొత్త దిల్లీ లోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ యాసిన్ మాలిక్ మే మొదటి వారంలో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం లో నేరపూరిత కుట్ర దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యటం ఉగ్రవాదులు కోసం నిధులు సేకరించటం, తీవ్రవాద కార్యకలాపాలు మరియు ఇతర కార్యకలాపాలు పై నేరం అంగీకరించడంతో దోషి గా నిర్దారించి బుధవారం నాడు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.