బిఇడి పరీక్షల్లో యదేచ్ఛగా మాస్ కాపీయింగ్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఫోటో

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో  బిఇడి పరీక్షలు శనివారం నాటి నుంచి నాలుగు రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో పొదిలి పట్టణంలో ఒక పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఒక ఫోటో సోషల్ మీడియా ‌వైరల్ మారటం తో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు ఈ విధంగా మాస్ కాపీయింగ్ కు పాల్పడటం పట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి శనివారం నాడు మాస్ కాపీయింగ్ పై విచారణ జరిపించి తదుపరి పరీక్షలు సరిగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.