శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నగర యాత్ర

శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నగర యాత్రను గురువారం నాడు నిర్వహించారు.

ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టు ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్, విశ్వనాథపురం, పెద్ద బస్టాండ్ , రథం రోడ్డు మీద గా వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు నగర యాత్రను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గజస్తంభం దాత సమంతపూడి నాగేశ్వరరావు, ఆలయం కమిటీ సభ్యులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు, పండు అనిల్, యక్కలి శేషగిరిరావు, శనగపల్లి నాగేశ్వరరావు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.