ఉద్యమం కొనసాగుతున్న దిశా యాప్ డౌన్లోడింగ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన దిశా యాప్ డౌన్లోడింగ్ ప్రత్యేక కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతుంది.
శనివారం తెల్లవారుజామున నుంచి పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా పోలీసులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రజలతో మమేకమై దిశా యాప్ డౌన్లోడింగ్ కార్యక్రమాన్ని ఉద్యమం కొనసాగిస్తున్నారు.
అదే విధంగా మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ ఎంపిడిఓ శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మండలం లోని పలు గ్రామాల్లో డౌన్లోడింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించాగా పొదిలి మున్సిపల్ పరిధిలో కమిషనర్ డానియల్ జోసప్ ఆధ్వర్యంలో పలు సచివాలయలను సందర్శించారు.