కుందూరు ను ఘనంగా సత్కరించిన ముల్లా కుటుంబ సభ్యులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ని ముల్లా కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక మసీదు తోట నందు ముల్లా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంకు హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ముస్లింల్లో అత్యంత వెనుకబడిన జీవిస్తున్న ముల్లా కుటుంబాలను బిసి ఈ కేటగిరీ చేర్చాలని వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టి తిసుకొని వెళ్లి ఆయన సహాకారంతో బిసి కమిషన్ ఛైర్మన్ మరియు ఇతర అధికారుల సమన్వయంతో ముల్లా లను బిసి ఈ కేటగిరీలో చేర్చి వారికి కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసామని అందుకు ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపలని అన్నారు.
అదే విధంగా పొదిలి పెద్ద చెరువును రిజర్వాయర్ మార్పు , జగనన్న లేఔట్ ఆక్రమణదారులకు పట్టాలు పంపిణీ మొదలైన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, ప్రభుత్వ వైద్యులు రఫీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి మరియు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు