ఇండోనేషియా లో జరిగే సమావేశాలకు బయలుదేరిన భారత యువ దౌత్యవేత్త ఇస్మాయిల్
ఇండోనేషియా లో జరిగే ఆసియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ కు పొదిలి ప్రాంత యువకుడు షేక్ ఇస్మాయిల్ సోమవారం నాడు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్ళారు.
ఇండోనేషియా దేశంలోని ప్రధాన నగరం బాలి నందు జూన్ 20 తేదీ నుంచి 23 తేదీ వరకు ఆసియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో భారతదేశం తరపున యువ దౌత్యవేత్త గా ప్రాతినిధ్యం వహించే అవకాశం పొదిలి ప్రాంతం చెందిన షేక్ ఇస్మాయిల్ ను వరించింది.
గతంలో జైపూర్ లో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరుపున ప్రతినిత్యం వహించిన సందర్భంగా మెరుగైన ప్రతిభా చూపటం ద్వారా ఆసియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ కు భారత్ తరుపున ప్రతినిత్యం వహించే అవకాశం ఏర్పడింది
బాలి జరిగే సమావేశంలో ఉత్తమ ప్రతిభ కనపరచాలని ఆశిద్దాం