గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం
పొదిలి నగర పంచాయితీ పరిధిలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నాడు ప్రారంభించారు.
బుధవారం నాడు స్థానిక 18వ వార్డు నందు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో ప్రకాశ్ నగర్, ఇరిగేషన్ ఆఫీస్ రోడ్డు, ఎబియం కాంపౌండ్ ఏరియా లోని సుమారు 400 నివాస గడపలను శాసనసభ్యులు సందర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని, సంక్షేమ పథకాలు అమలు తీరు అడిగి తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు మరియు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు