రెండో రోజుకు చేరిన గడప గడపకు మన ప్రభుత్వం
పొదిలి నగర పంచాయితీ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
గురువారం నాడు స్థానిక 17వ వార్డు నందు పర్యటించిన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దృష్టికి మంచి నీరు, త్రాగు నీరు , పారిశుద్ధ్య సమస్యలు, మరియు సిమెంట్ రోడ్లు నిర్మాణల మొదలైన సమస్యలు తీసుకొని వచ్చారు.
సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు శాసనసభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెంట అన్ని శాఖల మండల స్థాయి అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు