పొదిలి పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు గా నూర్జహాన్ హనిమూన్ శ్రీనువాసులు రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నిక
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొదిలి మున్సిపల్ పరిధిలోని 20 వార్డు కమిటీలు, గ్రామీణ మండలం పరిధిలోని 16 గ్రామ పంచాయతీ కమిటీల ఎన్నికలను ఎన్నుకోవడం జరిగింది.
శుక్రవారం నాడు స్థానిక విశ్వనాథపురంలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థ నందు జరిగిన 20 వార్డు కమిటీల సమావేశంలో పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షులు గా 18 వార్డుకు చెందిన మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు షేక్ నూర్జహాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అదే విధంగా గ్రామీణ మండలం పరిధిలోని 16 గ్రామ పంచాయతీల కమిటీల సమావేశంలో మల్లవరం గ్రామానికి చెందిన దుగ్గెపుడి శ్రీనివాసులు రెడ్డి (హనిమూన్) ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పట్టణ, మండల కమిటీ అధ్యక్షులను సత్కరించారు