సంప్రదాయ దుస్తులతో సమావేశంకు హాజరైన యువ దౌత్యవేత్త
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఇండోనేషియా లో జరిగే ఆసియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ కు పొదిలి యువకుడు యువ దౌత్యవేత్త షేక్ ఇస్మాయిల్ సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
ఇండోనేషియా దేశంలోని ప్రధాన నగరం బాలి నందు జూన్ 20 తేదీ నుంచి 23 తేదీ వరకు ఆసియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో భారతదేశం తరపున యువ దౌత్యవేత్త గా ప్రాతినిధ్యం వహించే అవకాశం పొదిలి ప్రాంతం చెందిన షేక్ ఇస్మాయిల్ తొలి రోజు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటుకున్నారు.