జూలై 1నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అమృత హస్తం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అమృత హస్తం కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు, బాలింతలకు భోజనం, పౌష్టికాహారం అందించడం జరుగుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు పొదిలి సిడిపిఓ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించి గ్రామాల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో తల్లులు కు అవగాహన కల్పించి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తో కలిసి జులై 1వ తేదీ నుంచి ప్రారంభమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.