సంపూర్ణ గృహ హక్కు పత్రాలు పంపిణీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జగనన్న పాల వెల్లువ అవగాహన సదస్సు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ పంపిణీ చేశారు.
బుధవారం నాడు స్థానిక స్ధానిక ఆముదలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామలవీడు గ్రామం నందు సర్పంచ్ సిరిమల్ల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఓటియస్ నందు నగదు చెల్లింపులు చేసిన లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాలు పంపిణీ చేశారు.
అనంతరం జగనన్న పాల వెల్లువ అవగాహన సదస్సు నిర్వహించి గ్రామస్తులు కు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ఫీల్డ్ మేనేజర్ బుల్లిన్ రావు , పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు