మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ ధర్నా
పొదిలి మున్సిపల్ కార్యాలయం వద్ద మంచి నీటి సరఫరా చెయ్యాలని కోరుతూ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మంగళవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తక్షణమే ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా కొనసాగించాలని, మంచి నీటి సరఫరాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ తో కందుల నారాయణరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి చర్చలు జరిపగా రేపటి నుంచి మంచి నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, కాటూరి నారాయణ ప్రతాప్, యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొల్లా నరసింహా యాదవ్, షేక్ రసూల్, సమంతపూడి నాగేశ్వరరావు, పండు అనిల్,మూరబోయిన బాబురావు యాదవ్, చప్పిడి రామలింగయ్య, మీగడ ఓబుల్ రెడ్డి,ముల్లా ఖూద్దుస్, సయ్యద్ ఇమాంసా, షేక్ గౌస్ భాష బొడ్డు సుబ్బయ్య, కాటూరి శ్రీను, జ్యోతి మల్లి, నరసింహారావు షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు