టిడిపి రాష్ట్ర డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గా స్వర్ణ ప్రీతం కృష్ణ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గా స్వర్ణ ప్రీతం కృష్ణ ను నియమిస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

స్వర్ణ ప్రీతం కృష్ణ ప్రముఖ మహిళా వైద్యురాలు పొదిలి మాజీ సర్పంచ్ స్వర్ణ గీత ఏకైక కుమారుడు నెల్లూరు లో ఎంబిబిఎస్ పూర్తి చేసి తన తల్లి వద్దనే ప్రాక్టీస్ ప్రారంభించి వైద్య వృత్తిలో కొనసాగుతు తల్లి వెంట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.


తనకు తెలుగు దేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పదవి లభించుటకు కారణమైన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు, జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు