ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
వివరాల్లోకి వెళితే అఖిలేష్ యాదవ్ 49వ జన్మదిన సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు స్థానిక పొదిలి శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను సర్పంచ్ చిరుమల్లె శ్రీనివాస్ యాదవ్ కోసి అభిమానులకు పంచి పెట్టారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి విశిష్ట సేవలందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అఖిలేష్ యాదవ్ భావి భారత ప్రధానిగా కిరీటం అందుకోవాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ ఫ్యాన్స్ నాయకులు సర్పంచ్ చిరుమల్లే శ్రీనివాస్ యాదవ్, పొల్లా నరసింహా యాదవ్,మూరబోయిన బాబురావు యాదవ్ , మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, వెల్పుల కృష్ణంరాజు,కనకం వెంకట్రావు, పెమ్మని అల్లూరి సీతారామరాజు, బాలగాని నాగరాజు, యేటి ఏడుకొండలు , అంకాళా రోశయ్య, నారబోయిన బిక్షాలు ,నారబోయిన సురేష్, మూరబోయిన శ్రీనివాస్, మొనపాటి నాగేంద్ర, బొడ్డు సుబ్బయ్య, చాగంటి వెంకటేశ్వర్లు, బాబు, ఉపాధ్యాయులు చావలి మురళి కృష్ణ, శివరాత్రి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు