పొదిలి మండలంలో కందుల విస్తృత పర్యటన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలంలో మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి విస్తృతంగా పర్యటించారు.
శుక్రవారం నాడు పొదిలి మండలం సలకనూతల,ఓబులక్కపల్లి, మాదాలవారిపాలెం , నందిపాలెం, కంబాలపాడు గ్రామాల్లోని తెలుగు దేశం పార్టీ బూత్ స్థాయి కమిటీలతో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయ్యారని ప్రభుత్వ వైఫల్యాలను బూత్ కమిటీ సభ్యులు స్థానిక నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తెలియజేయాలని తద్వారా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు తనకు కేటాయించిన 100 ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుగుదేశం శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని బూత్ కమిటీ సభ్యులకు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా , మండల స్థాయి తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు