సిపిఐ మండల కార్యదర్శిగా కె వి రత్నం ఎన్నిక
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) పొదిలి మండల శాఖ కార్యదర్శి గా కె వి రత్నం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండలం రాజుపాలెం గ్రామంలో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల మహాసభ లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక మరియు నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు అందే నాసరయ్య మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు